జగిత్యాల (D) గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లె గ్రామంలోని దుర్గామాత ఆలయంలో దుర్గా శరన్నవరాత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. అయితే, సంప్రదాయ దుస్తుల్లోనే రావాలని, నుదుట కుంకుమ ధరించాలని, మహిళలు జుట్టు విరబోసుకోవద్దని హిందూ సంస్కృతిని గుర్తు చేసేలా ఆలయం బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ భక్తులను ఆలోచింపజేస్తుంది. ఆధ్యాత్మిక భావనలకు అద్దం పట్టేలా ఉన్న ఈ ఫ్లెక్సీ ని చూసి పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.