జగిత్యాల జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ లో గల శ్రీనగర్ కాలనీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా బోనాల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటికో బోనం చొప్పున మహిళలు డప్పు చప్పుల మధ్య బోనాలు ఎత్తుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, గౌరవ అధ్యక్షులు వావిలాలగంగాధర్ అధక్షులు పసుల మధుసూదన్ పాల్గొన్నారు.