జగిత్యాల పట్టణంలోని 10వ వార్డు లింగంపేటలో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ కార్యక్రమంలో భాగంగా రూ 13 లక్షలతో నిర్మించిన బస్తీ దవాఖానను ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం ప్రారంభించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో టీబీ అవగాహన పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ ప్రమోద్, కమిషనర్ స్పందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషణం, అడువాల జ్యోతి లక్ష్మణ్, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు.