లోన్ యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య

554చూసినవారు
లోన్ యాప్ వేధింపులు.. యువకుడు ఆత్మహత్య
ధర్మపురి నియోజకవర్గం పరిధిలోని పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన అక్కినపల్లి లిఖిత్ (20) అనే యువకుడు లోన్ యాప్ లో అప్పు తీసుకుని, వారి వేధింపుల వల్లే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. గత 20 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనలో, కుటుంబ సభ్యులు అతన్ని హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. పెగడపల్లి ఎస్సై కిరణ్ కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్