చెల్లి వరుసయ్యే అమ్మాయితో ప్రేమాయణం.. కోరిక తీర్చాలని వేధింపులు!

4చూసినవారు
జగిత్యాల జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. చెల్లెలి వరుస అయిన అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ మనోజ్ కుమార్ అనే యువకుడు వేధింపులకు గురిచేయడంతో యువతి ఆత్మహత్యాయత్నం చేసింది. సదరు యువతిని బలవంతంగా లొంగదీసుకున్న మనోజ్.. ఈ విషయం ఎవరికైనా చెబితే యువతిని, ఆమె తమ్ముడిని చంపుతానని బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. ఈ క్రమంలోనే సూసైడ్ నోట్ రాసి, పురుగుల మందు తాగి ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆ యువతిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

సంబంధిత పోస్ట్