జగిత్యాల: రైలు పట్టాలపై వ్యక్తి మృతి

943చూసినవారు
జగిత్యాల: రైలు పట్టాలపై వ్యక్తి మృతి
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంభరావుపేట గ్రామం వద్ద రైలు పట్టాలపై పుల్లూరి భీమయ్య (50) అనే వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. సమాచారం అందిన వెంటనే మేడిపల్లి ఎస్సై సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిజామాబాద్ రైల్వే జీఆర్పీకి సమాచారం అందించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. భీమయ్యకు భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.

సంబంధిత పోస్ట్