Apr 03, 2026, 17:04 IST/జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల: ఆగి ఉన్న లారీని ఢీకొని ఇద్దరి మృతి
Apr 03, 2026, 17:04 IST
శుక్రవారం రాత్రి జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొట్టింది. లారీ టైరు ఫంక్షర్ అవ్వడంతో దానిని రోడ్డుపై నిలిపివేశారు. ఈ విషయాన్ని గమనించని బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు లారీని వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందారు. కోరుట్ల నుండి జగిత్యాల వైపు వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.