
బరువు నియంత్రణకు మందులు వాడలేదు: తమన్నా
సినిమా హీరోయిన్లు సన్నగా ఉండాలనే ఒత్తిడిలో భాగంగా బరువు తగ్గడానికి మందులు వాడుతున్నారనే పుకార్లపై మిల్కీ బ్యూటీ తమన్నా స్పందించింది. ఒక జాతీయ మీడియాతో మాట్లాడుతూ, తాను 15 ఏళ్ల వయసు నుంచి ఇండస్ట్రీలో ఉన్నానని, తనలో వచ్చిన మార్పులన్నీ సహజసిద్ధమైనవేనని, ఎప్పుడూ బరువు పెరగకుండా ఉండేందుకు మందులు వాడలేదని, కేవలం వర్కౌట్లు, డైట్ ద్వారానే ఫిజిక్‌ను మెయింటెయిన్ చేసుకుంటున్నానని స్పష్టం చేసింది. వయసుతో పాటు శరీరంలో మార్పులు సహజమని, కరోనా సమయంలో తనపై వచ్చిన ట్రోల్స్ బాధించాయని తెలిపింది.




