కరీంనగర్: ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు నిర్వహించాలి: కలెక్టర్

3చూసినవారు
కరీంనగర్: ప్రశాంత వాతావరణంలో బక్రీద్ వేడుకలు నిర్వహించాలి: కలెక్టర్
బక్రీద్ పర్వదినాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ చిత్రా మిశ్రా సూచించారు. స్లాటర్ హౌస్‌ల వద్ద కట్టుదిట్టమైన పర్యవేక్షణ, వ్యర్థాల సక్రమ నిర్వహణ, చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. సీపీ గౌష్ ఆలం మాట్లాడుతూ.. ప్రత్యేక పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి, అక్రమ రవాణాపై నిఘా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్