ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, ఏదో ఒక రోజు హిజాబ్ ధరించిన మహిళ భారతదేశ ప్రధాన మంత్రి అవుతారని చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఒవైసీ తన పార్టీలో మహిళలకు నిజమైన నిర్ణయాధికార స్థానాల్లో ఎంతమంది ఉన్నారని ప్రశ్నించారు. ఎంఐఎం పార్టీ ఇప్పటివరకు ఎంతమంది మహిళలకు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇచ్చిందో నిలదీశారు. 2018లో ఓల్డ్ సిటీలో బీజేపీ తరపున పోటీ చేసిన షహాదీ సయ్యద్ అనే మహిళను బెదిరించి ఓడించారని, మహిళల విషయంలో ఇదే మీ అసలు ముఖమని విమర్శించారు. ఆమెను ఓడించినా, జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యురాలిగా సేవలు అందిస్తున్నారని గుర్తు చేశారు.