క్రాంతి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గోదాం గడ్డలో కామదహన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కార్పొరేటర్ పొన్నం లక్ష్మి గౌడ్, కామ, క్రోధ, లోభ, మోహాలకు దూరంగా ఉండాలని, సమాజంలో సత్సంకల్పంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇలాంటి కార్యక్రమాలు సామాజిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.