కరీంనగర్ జిల్లా ఆరేపల్లికి చెందిన అశోక్ వర్ధన్ (55) వరంగల్ రైల్వే స్టేషన్ లో స్పృహ తప్పి పడిపోయిన తర్వాత చికిత్స పొందుతూ మరణించారు. ఈ నెల 26న ఒకటో నంబర్ ప్లాట్‌ఫాం వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు అతన్ని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఆయన పరిస్థితి విషమించి మరణించినట్లు జీఆర్‌పీ సీఐ తెలిపారు. మృతుని బంధువులకు సమాచారం అందించి, పోలీసులు కేసు నమోదు చేశారు.