Mar 08, 2026, 16:03 IST/
మూగ మహిళపై లైంగిక వేధింపులు.. గుండు గీయించి ఊరేగించారు
Mar 08, 2026, 16:03 IST
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలోని ఓ గ్రామంలో మూగ మహిళను లైంగికంగా వేధించిన వ్యక్తికి గ్రామస్థులు కఠిన శిక్ష వేశారు. నిందితుడికి గుండు గీయించి, ఊరంతా ఊరేగించి, రూ.5,001 జరిమానా విధించారు. ఈ ఘటనపై గ్రామస్థులు నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసుల దృష్టికి వెళ్లింది. దీనిపై పోలీసులు విచారణ చేపట్టి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.