Mar 13, 2026, 16:03 IST/కరీంనగర్
కరీంనగర్
టీజేఏ కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా రావుల సత్యనారాయణ
Mar 13, 2026, 16:03 IST
తెలంగాణ జర్నలిస్ట్ అసోసియేషన్ (టీజేఏ) కరీంనగర్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ గా రావుల సత్యనారాయణను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఆర్ గౌరీ నియమించారు. ఈ నియామకంతో, సత్యనారాయణ ఉమ్మడి జిల్లాలో యూనియన్ కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. జర్నలిస్ట్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న సత్యనారాయణ, ఉమ్మడి జిల్లాలో ఫోరం అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ నియామకం పట్ల అడ్వైజరీ కమిటీ చైర్మన్ ఉప్పల లక్ష్మణరావుతో పాటు పలువురు అభినందించారు.