పారిశుద్ధ్య పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని మున్సిపల్ కమిషనర్ ప్రపోజ్ దేశాయ్ అధికారులను హెచ్చరించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం పారిశుద్ధ్య విభాగం సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్‌లు, జవాన్‌లతో సమీక్ష నిర్వహించారు. నగరంలో మెరుగైన పారిశుద్ధ్య నిర్వహణ, అకాల వర్షాల పట్ల అప్రమత్తత, ముందస్తు సహాయక జాగ్రత్త చర్యలు, ఇంకుడు గుంతల గుర్తింపు, ఆన్‌లైన్ నమోదుపై చర్చించారు.