కరీంనగర్ కు చెందిన టీం ఫంకీ జోన్ యువకులు, బెల్లంపల్లికి చెందిన శివ, సహస్ర అనే ఇద్దరు పసిపిల్లల ప్రాణాలు కాపాడేందుకు వేములవాడలో నిధుల సేకరణ చేపట్టారు. ఈ పిల్లలకు (SMA) వ్యాధి సోకింది. వీరి చికిత్సకు అవసరమైన రెండు ఇంజక్షన్ల కోసం రూ.32 కోట్లు అవసరమని, ఇప్పటివరకు రూ.30 లక్షలు సేకరించినట్లు తెలిపారు. వారి ప్రాణాలను నిలబెట్టడమే లక్ష్యంగా ఈ సేకరణ జరుగుతోంది.