కరీంనగర్ జిల్లాలో 108 సేవలు అత్యవసర సమయాల్లో ప్రజలకు అండగా నిలుస్తున్నాయి. జిల్లాలో 16 అంబులెన్సులు, 33 మంది సిబ్బంది, 35 మంది పైలట్లు సేవలు అందిస్తున్నారు. గత ఏడాది 23,275 మందిని ఆసుపత్రులకు తరలించారు. రోడ్డు ప్రమాదాలు, గర్భిణుల తరలింపు, గుండె, శ్వాసకోశ సమస్యల కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. జిల్లా మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ మాట్లాడుతూ, వాహనాలు, పరికరాలను నిరంతరం తనిఖీ చేస్తూ నాణ్యమైన సేవలు అందిస్తున్నామని తెలిపారు.