ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 10వ తరగతి ఫలితాల నేపథ్యంలో
విద్యార్థులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని, తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని మానసిక నిపుణులు సూచించారు. తక్కువ మార్కులు వస్తే ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని, పిల్లలకు ధైర్యం చెప్పి వారి భావోద్వేగాలను గమనించాలని కోరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 40,662 మంది
విద్యార్థులు పరీక్షలు రాశారు. కరీంనగర్ జిల్లాలో 13,157 మంది, జగిత్యాల జిల్లాలో 12,693 మంది, పెద్దపల్లి జిల్లాలో 7,495 మంది, సిరిసిల్ల జిల్లాలో 7,317 మంది పరీక్షలకు హాజరయ్యారు.