కరీంనగర్ నగర పాలక సంస్థ ఎన్నికల బరిలో మొత్తం 66 డివిజన్లకు 398 మంది అభ్యర్థులు నిలిచారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు 66 స్థానాల్లో పోటీ చేస్తుండగా, కాంగ్రెస్ 65, ఫార్వర్డ్ బ్లాక్ 31, ఎంఐఎం 15, జనసేన 14, బీఎస్పీ 7 స్థానాల్లో పోటీపడుతున్నాయి. సీపీఐ, సీపీఐ-ఎంఎల్ నుంచి ఒక్కొక్కరు, ఇతర పార్టీల నుంచి 9 మంది, 123 మంది స్వతంత్రులు కూడా బరిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఎన్నికల చిత్రం స్పష్టమైంది.