మద్యం మత్తులో షట్టర్ ను ఢీకొట్టిన కారు!

2చూసినవారు
మద్యం మత్తులో షట్టర్ ను ఢీకొట్టిన కారు!
కరీంనగర్ కు చెందిన మహ్మద్ అబీద్ (25) అనే యువకుడిపై నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు నమోదైంది. శుక్రవారం రాత్రి 2.10 గంటలకు మద్యం సేవించి కారు నడుపుతూ విద్యానగర్ లోని ఓ టైలర్ షాపును ఢీకొట్టాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.