కరీంనగర్ జిల్లాలో హోలీ పండుగ సందర్భంగా సోమవారం రాత్రి కామదహన కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఫాల్గుణ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు రాత్రి జరిగిన ఈ వేడుకల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేసి కాముడిని దహనం చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మొక్కులు చెల్లించుకున్నారు. కొన్ని ప్రాంతాల్లో తిథిని బట్టి పౌర్ణమి రోజున కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని భక్తులు తెలిపారు.