రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఆరెపల్లి గ్రామంలో పది ఫలితాల్లో 564 మార్కులతో ఉత్తీర్ణత సాధించిన చెలుకల చంద్రశేఖర్ రెడ్డిని గ్రామ సర్పంచ్ మరిజ మోహన్ రావు ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, చదువుతోనే మంచి భవిష్యత్తు ఉంటుందని, విద్య కోసం తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భూమి రెడ్డి, మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, నాయకులు కిషన్, లచ్చి రెడ్డి, బుర్ర రాములు, స్వామి చరణ్ గౌడ్, సురేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, మల్లయ్య, తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.