జానపద కళాకారుల సంక్షేమంపై కరీంనగర్లో శనివారం జరిగిన 'జాగృతి జనం బాట' కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, కళాకారులను ప్రభుత్వం గుర్తించి, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి వారికి వేతనాలు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. జానపద సంప్రదాయాన్ని నిలబెట్టిన కళాకారులకు కళాభివందనం చేసిన కవిత, హక్కుల కోసం అందరూ కలిసి పోరాటం కొనసాగించాలని పిలుపునిచ్చారు.