అంతర్జాతీయ శాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని, కరీంనగర్ ఎస్. ఆర్. ఆర్. ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్లు, బ్రహ్మకుమారీస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ జిల్లాలో ఒక ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల్లో శాంతి, సామరస్యం, పర్యావరణ పరిరక్షణ భావాలను పెంపొందించడం లక్ష్యంగా, శాంతి, సహనం, సోదరభావం, పరస్పర గౌరవం వంటి విలువల ప్రాధాన్యతను వివరించారు. పర్యావరణ పరిరక్షణలో బాధ్యతగా వ్యవహరించాలని, యువత సమాజంలో శాంతి, సామరస్యాన్ని పెంపొందించడంలో ముందుండాలని సూచించారు.