శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో ఒక విద్యార్థి డిబార్

5చూసినవారు
శాతవాహన యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో ఒక విద్యార్థి డిబార్
శాతవాహన విశ్వవిద్యాలయం పరిధిలో జరుగుతున్న డిగ్రీ 5, 3వ సెమిస్టర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మంగళవారం జరిగిన 5వ సెమిస్టర్ పరీక్షకు 8,516 మంది విద్యార్థులు హాజరు కాగా 420 మంది గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలో ఒక విద్యార్థి మాల్ ప్రాక్టీస్‌కు పాల్పడినట్లు గుర్తించి డిబార్ చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ డి. సురేశ్ కుమార్ తెలిపారు. అదేవిధంగా 3వ సెమిస్టర్ పరీక్షకు 436 మంది హాజరు కాగా 47 మంది గైర్హాజరయ్యారు. పరీక్షలన్నీ ప్రశాంతంగా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్