వరదలో కొట్టుకుపోయిన యువకుడు

4చూసినవారు
వరదలో కొట్టుకుపోయిన యువకుడు
గన్నేరువరం మండల కేంద్రంలోని ఊర చెరువు మత్తడి వరదలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న బీహార్‌కు చెందిన రజీప్ వరద ఉధృతికి నీటిలో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. నీటిలో మునిగిపోయిన దుర్గామాత విగ్రహం స్టాండ్‌ను పట్టుకుని అతను ప్రాణాలతో బయటపడ్డాడు. స్థానిక జాలర్లు అతడిని తాడు సహాయంతో బయటకు తీశారు. పోలీసులు వరద ఉధృతి ఉన్న చోట వెళ్లకూడదని స్టాపర్స్ ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని లెక్కచేయకుండా వెళ్లడమే ప్రమాదానికి కారణమైంది.

సంబంధిత పోస్ట్