పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నాయకులు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట దీక్షా శిబిరంలోనే నిద్రించి నిరసన తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఈ 24 గంటల దీక్ష రాత్రి కూడా కొనసాగింది. ప్రభుత్వం మొండివైఖరి వీడకుంటే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని జిల్లా కన్వీనర్ విష్ణు హెచ్చరించారు.