క్రికెట్ విశ్వక్రీడని మరియు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకత కలిగిన క్రీడగా గుర్తింపు పొందినదని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వి.నరేందర్ రెడ్డి గారు స్థానిక కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఇ- టెక్నో పాఠశాలలో పాఠశాలకు చెందినటువంటి విద్యార్థులు SGF జోనల్ స్థాయి పోటీలకు ఎంపికైన సందర్భంగా నిర్వహించినటువంటి ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై వారు మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంపొందించడానికి వార్షిక ప్రణాళికలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వివిధ కార్యక్రమాలలో అద్భుతం ప్రదర్శన కనబరిచిన వారిని వివిధ స్థాయిలలో నిర్వహింపబడేటువంటి పోటీలకు ప్రోత్సహించడమే కాకుండా అందులో విజయం సాధించడమే లక్ష్యంగా శిక్షణ ఇప్పిస్తున్నామని వారు చెప్పారు.
ఈ క్రమంలో ఇటీవల కాలంలో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ అకాడమీలో నిర్వహించినటువంటి జిల్లా స్థాయి SGF జిల్లా స్థాయి క్రికెట్ ఎంపిక పోటీలలో అండర్ 17 విభాగంలో పాఠశాలకు చెందినటువంటి ఏ.అశ్వత్రావు, కె ఋషి రెడ్డి మరియు కే.ఆశ్రిత్ పటేల్ త్వరలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిర్వహించబోయే జోనల్ సాయి పోటీలకు ప్రాతినిధ్యం ఇవ్వబోతున్నారని హర్షం వ్యక్తం చేస్తూ విజేతలు అందరికీ పుష్పగుచ్చాలను అందజేసి జోనల్ స్థాయి పోటీలలోను విశిష్ట ప్రతిభను కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, వ్యాయామ ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.