ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులను నూతనంగా నియమించడం జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండలానికి చెందిన కరీంనగర్ కోర్టులో అడ్వకేట్ వృత్తిలో కొనసాగుతున్న ఆదివాసి ఎరుకల సీనియర్ ఉద్యమ నాయకులు మానుపాటి రవి ఎరుకల ని జిల్లా అధ్యక్షులుగా నియామకం చేశారు. అదేవిధంగా కరీంనగర్ పట్టణానికి చెందిన ఆదివాసి ఎరుకల ముద్దుబిడ్డ బిజిలి శ్రీనివాస్ ని ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇద్దరినీ నియామకం చేయడం జరిగింది.