గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న శ్రీ మొగిలి మల్లేశంకు ఎస్ఐ పదోన్నతి లభించింది. దీంతో పాటు ఆయన సిరిసిల్లకు బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా గంగాధర పోలీస్ స్టేషన్‌లో ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో సత్కార కార్యక్రమం నిర్వహించారు. మల్లేశం గారి క్రమశిక్షణ, విధి నిర్వహణలో నిబద్ధతను పోలీస్ సిబ్బంది కొనియాడారు. పదోన్నతి శుభాకాంక్షలు తెలిపి, సిరిసిల్లలో కొత్త బాధ్యతలు విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. మల్లేశం తన సేవాకాలంలో సహకరించిన ఉన్నతాధికారులు, సహచర సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.