చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలోని గంగాధర, లక్ష్మీదేవిపల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అర్ధరాత్రి వరకు పర్యటించారు. అకాల వర్షం, గాలివానతో దెబ్బతిన్న ఇళ్లను, వ్యవసాయ కల్లాలను ఆయన స్వయంగా పరిశీలించారు. బాధిత కుటుంబాలను ఓదార్చి, ప్రభుత్వం తరఫున తగిన నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అధికారులు తక్షణమే నష్టం అంచనా వేయాలని ఆదేశించారు.