తడగొండలో బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన
By kasarapusridhargoud 0చూసినవారుప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా తడగొండ అంగన్‌వాడీ కేంద్రంలో సోమవారం బాలల సంరక్షణ, బాల్య వివాహాల నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. అంగన్‌వాడీ టీచర్ రాజమణి కిశోర బాలికలు, తల్లిదండ్రులకు చట్టంపై అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని, పిల్లల భవిష్యత్తును దెబ్బతీస్తాయని వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ ఉయ్యాల శ్రీనివాస్ గౌడ్, ఉపసర్పంచ్ చేపూరి వెంకటేష్, కిశోర బాలికలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.