కరీంనగర్‌లో సోలార్ రూఫ్‌టాప్ పై అవగాహన కార్యక్రమం

11చూసినవారు
కరీంనగర్‌లో సోలార్ రూఫ్‌టాప్ పై అవగాహన కార్యక్రమం
సోలార్ రూఫ్‌టాప్ ప్రాజెక్ట్‌పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ నెల 6న కరీంనగర్‌లో అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నారు. గణాంక భవన్‌లో ఉదయం 10: 45 గంటలకు కార్యక్రమం ప్రారంభం కానుంది. సౌర విద్యుత్ వినియోగం, విద్యుత్ బిల్లుల తగ్గింపు, స్వచ్ఛమైన ఇంధనం, ఇంధన స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించనున్నారు. వివరాలకు 9705035616 ఈ నెంబర్ కు సంప్రదించగలరు.

సంబంధిత పోస్ట్