బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన వ్యక్తిగత విమర్శలను మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తీవ్రంగా ఖండించారు. చొప్పదండి నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, బండి సంజయ్ తన స్థాయి మరిచి చిల్లర భాష మాట్లాడుతున్నారని, వెంటనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జువెలరీ దోపిడీపై కేటీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపితే సంజయ్‌కు ఎందుకు నొప్పి అని ప్రశ్నించారు. అభివృద్ధి వదిలి రేవంత్‌కు సహాయ మంత్రిలా వ్యవహరిస్తున్నారని, బెదిరింపులకు భయపడలేదని హెచ్చరించారు.