కరీంనగర్ సహకార అర్బన్ బ్యాంకు పాలకవర్గ ఎన్నికలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన పోలింగ్‌లో మొత్తం 42.23 శాతం ఓట్లు నమోదయ్యాయి. కరీంనగర్‌లో 7,272 మంది ఓటర్లకు 3,342 మంది, జగిత్యాలలో 2,025 మంది ఓటర్లకు 772 మంది ఓటు వేశారు. కరీంనగర్ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్లలో లెక్కింపు కొనసాగుతోంది. మరికొద్దిసేపట్లో ఫలితాలు వెలువడనున్నాయి.