ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా కరీంనగర్ బైపాస్ రోడ్లోని ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, బీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ చల్లా హరిశంకర్, ఇతర ముఖ్య నాయకులు పూలమాల వేసి శనివారం నివాళులర్పించారు. నిరంకుశ నిజాం పాలనకు వ్యతిరేకంగా, తెలంగాణ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకున్న గొప్ప మహనీయుడు బాపూజీ అని కొనియాడారు. బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని పేర్కొన్నారు.