
పుంజుకున్న రుతుపవనాలు.. దేశవ్యాప్తంగా భారీ వర్షాలు
గత కొన్ని వారాలుగా స్తంభించిపోయిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడబోయే రెండు బలమైన అల్పపీడనాలు, రుతుపవన ద్రోణిలో వస్తున్న మార్పుల వల్ల రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నెలలో ఏర్పడిన వర్షపాత లోటును ఈ అల్పపీడనాలు భర్తీ చేయనున్నాయి. జులై మొదటి వారం నాటికి పంజాబ్, హర్యానా, ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని అంచనా. ముంబై మహానగరాన్ని మరోసారి అతి భారీ వర్షాలు ముంచెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.




