భారత జాతీయ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ) కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలిగా బీర్ల పద్మ, ప్రధాన కార్యదర్శిగా కొట్టె అంజలి ఎన్నికయ్యారు. నగరంలోని బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన జనరల్ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. మహిళలపై జరుగుతున్న దాడులు, వివక్షపై రాజీలేని పోరాటం చేస్తామని, అసంఘటిత రంగ కార్మికులకు అండగా ఉంటూ జిల్లావ్యాప్తంగా సంఘాన్ని బలోపేతం చేస్తామని నూతన అధ్యక్షురాలు బీర్ల పద్మ తెలిపారు.