పేద కుటుంబ వివాహానికి బెండ్రం తిరుపతిరెడ్డి చేయూత

12చూసినవారు
పేద కుటుంబ వివాహానికి బెండ్రం తిరుపతిరెడ్డి చేయూత
రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామంలో బుధవారం పేద కుటుంబానికి చెందిన తాడురి దుర్గయ్య-లక్ష్మిల కుమార్తె అనూష వివాహానికి బెండ్రం తిరుపతిరెడ్డి ఫౌండేషన్ ద్వారా రూ. 10,000 విలువైన టేకు మంచాలను అందజేశారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు మాట్లాడుతూ, ఇల్లంతకుంట మండలంలోని పేద కుటుంబాల కుమార్తెల వివాహాలకు కళ్యాణ కానుకలు, సహాయాలు అందిస్తూనే ఉంటామని, గ్రామాల్లోని యువకులు, సేవా ప్రతినిధులు సమాచారం అందించాలని కోరారు. ఈ సేవా కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్