కరీంగనర్ దోపిడీ ముఠా బైక్ స్వాధీనం.. ట్విస్ట్..!

కరీంనగర్‌లోని బంగారం షోరూమ్ దోపిడీ కేసులో నిందితులు ఉపయోగించిన బైక్‌ను పోలీసులు ధర్మపురిలో స్వాధీనం చేసుకున్నారు. విచారణలో, వాహనంపై హైదరాబాద్ నంబర్ ప్లేట్ ఉన్నప్పటికీ, ఛాసిస్ నంబర్ ఆధారంగా అది ఢిల్లీకి చెందినదని గుర్తించారు. పోలీసుల దృష్టి మరల్చడానికి ముఠా నకిలీ నంబర్ ప్లేట్‌ను ఉపయోగించినట్లు తేలింది. ఈ ఆధారాలతో, నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
