కారు ఢీకొని బైకర్ మృతి అతివేగం, నిర్లక్ష్యమే కారణం కేసు నమోదు

2చూసినవారు
కారు ఢీకొని బైకర్ మృతి అతివేగం, నిర్లక్ష్యమే కారణం కేసు నమోదు
జూన్ 28, 2026 రాత్రి 8:30 గంటలకు వెంకంపల్లికి చెందిన గుండవేణి కొమురయ్య (45) తన టీవీఎస్ ఎక్సెల్ బైక్‌పై గొర్ల దగ్గరకు వెళ్తుండగా గంగాధర మండలం పిట్టలపల్లి జంక్షన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. బోయిన్‌పల్లి వైపు వెళ్తున్న కారు డ్రైవర్ పోలే మహేష్ అతివేగం, నిర్లక్ష్యంగా నడపడంతో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ఘటనలో కొమురయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వంశీకృష్ణ తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you