జమ్మికుంట మున్సిపల్ ఎన్నికల్లో కమలం వికసింపజేయాలని బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. BRS, కాంగ్రెస్ పార్టీలకు తామే ప్రత్యామ్నాయమని చాటిచెప్పేలా, మొత్తం 30 వార్డుల్లోనూ అభ్యర్థులను ప్రకటించి సమరానికి సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలు, జాతీయవాదం, స్థానిక సమస్యలను అజెండాగా చేసుకుని బీజేపీ అభ్యర్థులు ఇంటింటికీ తిరుగుతున్నారు. ఈసారి అత్యధిక సీట్లు గెలిచి తమ సత్తా నిరూపించుకుంటామని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.