ఎస్సీ సంక్షేమానికి కేటాయించిన నిధుల దారి మళ్లింపుపై సమగ్ర విచారణ జరిపించాలని, ఎస్సీ సమాజానికి రావాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ
బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్ ఈడీ కార్యాలయాన్నిమంగళవారం ముట్టడించారు. రాష్ట్ర అధ్యక్షుడు కాంతి కిరణ్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాసి నాగరాజు, తెలంగాణ
బీజేపీ ఎస్సీ మహిళా మోర్చా జాయింట్ కన్వీనర్ గాదం లలితతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్సీ నిధులను ఎస్సీ సమాజ అభివృద్ధికే ఖర్చు చేయాలని, నిధుల దుర్వినియోగం జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్ చేశారు.