ప్రభుత్వ హాస్టల్లో చదువుతున్న విద్యార్థులకు దుప్పట్లు పంపిణీ చేయాలని నిరసిస్తూ కరీంనగర్ కలెక్టరేట్ ముందు ఎస్ఎఫ్ఎ నాయకులు, కార్యకర్తలు బుధవారం ధర్నా చేపట్టారు. చలి తీవ్రత పెరగడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రభుత్వం విద్యార్థులకు దుప్పట్లో పంపిణీ కూడా చేయలేదని ప్రతి విద్యార్థికి రెండు దుప్పట్లు పంపించాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు పెంచాలని కోరారు.