బోయిన్పల్లి పోలీసుల చాకచక్యంచోరీ కేసు ఛేదన, నిందితుడి అరెస్ట్

691చూసినవారు
బోయిన్పల్లి పోలీసుల చాకచక్యంచోరీ కేసు ఛేదన, నిందితుడి అరెస్ట్
బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్కాపూర్‌లో ఈ నెల 25న జరిగిన ఇంటి చోరీ కేసును పోలీసులు ఛేదించారు. పెళ్లికి వెళ్లిన కోరెపు పెద్దులు ఇంట్లోంచి 3 గ్రాముల బంగారు పుస్తెలు, రూ. 10 వేల నగదు, రెడ్‌మీ ఫోన్ చోరీకి గురయ్యాయి. మొత్తం రూ. 35 వేల ఆస్తి విలువైన ఈ కేసులో, సాంకేతిక ఆధారాలతో సార్వారెడ్డిపల్లికి చెందిన కొత్తూరి మధు(21)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని నుంచి బంగారం, ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నగదు ఖర్చు చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. నిందితుడిపై ఇప్పటికే 6 చోరీ కేసులు, పీడీ చట్టం కింద కేసులు ఉన్నాయని సీఐ శ్రీనివాస్ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించిన ఎస్‌ఐ రమాకాంత్, సిబ్బందిని సీఐ అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్