రాజన్న సిరిసిల్ల జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం, ఇల్లంతకుంట మండలం, వెంకట్రావుపల్లి గ్రామంలోని అంగన్వాడి సెంటర్లో బుధవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు సర్పంచ్ చల్లా నవీన్ కుమార్ అధ్యక్షతన జరిగాయి. ఈ సందర్భంగా సూపర్వైజర్ చంద్రకళ మాట్లాడుతూ, బిడ్డ పుట్టిన వెంటనే తల్లి ముర్రు పాలు పట్టించాలని, ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలే ఇవ్వాలని సూచించారు. ముర్రు పాలలో బిడ్డకు అవసరమైన వ్యాధి నిరోధక శక్తి ఉంటుందని, అవి అమృతంతో సమానమని, డబ్బా పాల వల్ల ఇన్ఫెక్షన్లు, ఆర్థిక నష్టం కలుగుతాయని తెలిపారు. కాబట్టి, ప్రతి తల్లి తన బిడ్డకు పుట్టిన వెంటనే ముర్రు పాలు, ఆరు నెలల వరకు తల్లిపాలు ఇచ్చి, ఆ తర్వాత అనుబంధ పోషకాహారం ఇవ్వాలని ఆమె సూచించారు.