కారు బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు!

13చూసినవారు
కారు బోల్తా.. ఒకరికి తీవ్ర గాయాలు!
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం ఓద్యారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేములవాడ రాజన్న దర్శనం ముగించుకుని వరంగల్ వెళ్తున్న ఓ కుటుంబం ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని బోల్తా కొట్టింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి, గాయపడిన వారిని కారులోంచి బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

సంబంధిత పోస్ట్