జమ్మికుంట మండలం, జగ్గయ్యపల్లిలో శనివారం ఊరు చెరువు మట్టిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్థానిక సీఐ రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం, ఎస్సై సంజీవ్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ చేస్తుండగా, ఓరుగంటి శ్రీనివాస్ రావు, డి.కుమార్, ఎన్.వెంగళరావు, వెల్పుల సంపత్, జి. తిరుపతి రెడ్డిలు ప్రభుత్వ అనుమతి లేకుండా చెరువు మట్టిని తరలిస్తుండగా పట్టుబడ్డారు. దీంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.