ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కేసు నమోదు!

1606చూసినవారు
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పై కేసు నమోదు!
కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, స్థానికులతో కలిసి కోర్టు వివాదంలో ఉన్న స్థలంలోకి అక్రమంగా ప్రవేశించి, షెడ్డు రేకులను తొలగించారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ ఘటనపై కరీంనగర్ రూరల్ పోలీసులు ఎమ్మెల్యేతో పాటు మరికొందరిపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాణా పరిధిలోని బొమ్మకల్ శ్రీరాజరాజేశ్వర కాలనీలో సర్వే నంబరు 126లోని ప్లాట్ నంబరు 273కు సంబంధించి శ్రీకర్, లక్ష్మీనారాయణతో పాటు మరికొందరి మధ్య వివాదం నెలకొంది. ఈ వివాదానికి సంబంధించి కరీంనగర్ ఆర్డీవో స్టేటస్ కో ప్రొసీడింగ్ జారీ చేసినప్పటికీ, ఎమ్మెల్యే దానిని ఉల్లంఘించి స్థలంలోకి ప్రవేశించారని తహసీల్దార్ సీఐకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్