హైదరాబాద్లో ఎస్సీ సంక్షేమ సంఘం నాయకులు మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి, చేవెళ్ల ఎస్సీ-ఎస్టీ డిక్లరేషన్లోని 12 హామీలను వెంటనే అమలు చేయాలని కోరుతూ వినతిపత్రం ఆదివారం సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించి, ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తీగల అశోక్ కుమార్, మేకల కమలాకర్, గద్దం లలిత, అడ్డాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.